Saturday, April 10, 2010

యుద్ధ దృశ్యం

అద్దానికి అద్దరి నుంచి
ఏదో మాట్లాడుతున్నట్లుంది
నిజానికి నాలోనుంచే
ఎవరో సుప్రభాతం పాడుతున్నట్లుంది

అద్దం ముందు నేను
తెర వెనకాలి ముఖంతోనే నుంచొన్నా - !
రంగంతా వొలిచేసుకొని
నిజం గొంతే సవరించుకున్నా
కావరం వొలికి పోయిన చూపుల్తో
పదే పదే గదంతా వెలిగిస్తున్నా - !
పర పరా చించిన కాగితాల్లోంచి
ఇదే కవిత జోడిస్తున్నా - !

ఐనా ఆయ్‌నా * నా యక్షగానమే
నాకు వినిపిస్తుంది
నా మత్తు ముషాయిరాలే
నాకు చూపిస్తుంది

అద్దం చిందిస్తున్న జీవితపు చుక్కల్లోంచి
తురుఫు ముక్కలేరుతున్నా ...
రేపటి మరో యుద్ధం కోసం స్వయం
సన్నద్ధమవుతున్నా...!

* ఆయ్‌నా (ఉర్దూ)- అద్దం

శృతి రెండున్నర

దొరకని చిన్న తునక సెకన్ల ఇసుకల్లో
దొరికిన నిన్న చినుకు రెప్పల కొలకుల్లో
వుందనుకుంటున్న లేమీ.. ఇంకా కరగదేమీ
అందుకున్న జాబిలి అంత మసకైందేమీ!


'పీచెస్ అండ్ క్రీం' తన మాయానన ఛాయ
ఒక మానసిక శూన్య చిత్రంలో విసర్గమౌతూ
పైకెగసిన జ్వాల తలకట్టై పొగలు జిమ్మి ఆకాశం చెమర్చినపుడు
వెదకబోయిన అర్థం 'నాట్ ఫౌండ్' అంటూ
జీవితపు డిక్షనరీ ఎండినపుడు

అలలు తగ్గి-వలలు వొగ్గి-స్వప్నం ఇటువైపు మళ్లీ మొగ్గి...

నిజమైన ఉపసంహారం నిరాకారమైన ప్రేమలోకి
కరిగిపోనా-కలిసిపోనా

వెలిసి తెల్లారి పోనా...!

వాన


రాక


ప్రశ్నాస్త్రం


ప్రకటన (http://www.koumudi.net/Monthly/2010/march/index.హ్త్మ్ల్)

తల విదిలించి తన నుదుటిమీద గుప్పెడు చెమట ముక్కలు
తెరుచుకున్న మనసులో విరుచుకున్న రెక్కలు
వెచ్చదనం చుట్టుకుని మరింత కాగిన ఆలోచనల రసయాత్రలు

మూసుకున్న కళ్లనుంచి జారే కన్రెప్పలు
కామేష్ఠిలో కరిగి మండిన కపోలాల మీద గోళ్లు
చివరికో గుక్కెడు తాదాత్మ్యం తలకెక్కించుకుని తన
నల్లని కళ్లలోకీ ముడతల మడతల్లోకీ లావాలా జారడం...

కసితో ఖంగున ధ్వనించే గుండె గోడల పరస్పర వైరుధ్యం
నలిగి వొడిలి కరిగిన సాయంత్రపు సౌకుమార్యం..

కామేశ్వరీ వొల్లదు.. మళ్లీ కెరటమూ పగలదు

ఎందుకంటే..

ఆరిన తడీ - సంధించిన శస్త్రమూ
సమాన దైన్య చిత్రాలు కనుక...

మూయని కళ్ళ కల


కలుపు మొక్కలు


హైకూలు


Sunday, January 10, 2010