Saturday, April 10, 2010

యుద్ధ దృశ్యం

అద్దానికి అద్దరి నుంచి
ఏదో మాట్లాడుతున్నట్లుంది
నిజానికి నాలోనుంచే
ఎవరో సుప్రభాతం పాడుతున్నట్లుంది

అద్దం ముందు నేను
తెర వెనకాలి ముఖంతోనే నుంచొన్నా - !
రంగంతా వొలిచేసుకొని
నిజం గొంతే సవరించుకున్నా
కావరం వొలికి పోయిన చూపుల్తో
పదే పదే గదంతా వెలిగిస్తున్నా - !
పర పరా చించిన కాగితాల్లోంచి
ఇదే కవిత జోడిస్తున్నా - !

ఐనా ఆయ్‌నా * నా యక్షగానమే
నాకు వినిపిస్తుంది
నా మత్తు ముషాయిరాలే
నాకు చూపిస్తుంది

అద్దం చిందిస్తున్న జీవితపు చుక్కల్లోంచి
తురుఫు ముక్కలేరుతున్నా ...
రేపటి మరో యుద్ధం కోసం స్వయం
సన్నద్ధమవుతున్నా...!

* ఆయ్‌నా (ఉర్దూ)- అద్దం

No comments: