Saturday, April 10, 2010

శృతి రెండున్నర

దొరకని చిన్న తునక సెకన్ల ఇసుకల్లో
దొరికిన నిన్న చినుకు రెప్పల కొలకుల్లో
వుందనుకుంటున్న లేమీ.. ఇంకా కరగదేమీ
అందుకున్న జాబిలి అంత మసకైందేమీ!


'పీచెస్ అండ్ క్రీం' తన మాయానన ఛాయ
ఒక మానసిక శూన్య చిత్రంలో విసర్గమౌతూ
పైకెగసిన జ్వాల తలకట్టై పొగలు జిమ్మి ఆకాశం చెమర్చినపుడు
వెదకబోయిన అర్థం 'నాట్ ఫౌండ్' అంటూ
జీవితపు డిక్షనరీ ఎండినపుడు

అలలు తగ్గి-వలలు వొగ్గి-స్వప్నం ఇటువైపు మళ్లీ మొగ్గి...

నిజమైన ఉపసంహారం నిరాకారమైన ప్రేమలోకి
కరిగిపోనా-కలిసిపోనా

వెలిసి తెల్లారి పోనా...!

No comments: